
ప్రభుత్వ ఆదాయానికి గండి
అనమతులు లేకుండా భారీగా మట్టి తరలిస్తు అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఒక టిప్పర్ వంటి వాహనాలకు ప్రభుత్వం నుంచి 19.5 మెట్రిక్ టన్నుల వరకు పాసింగ్ లోడ్ అనుమతులు ఉంటాయి. ఈ లెక్కన ఒక్కో టిప్పర్ మట్టి తరలింపునకు ప్రభుత్వానికి రూ.900 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇవేవి లేకుండానే మట్టి తరలింపులు చేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్ల ద్వార మట్టిని తరలిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుండటంతో స్థానికంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.