యూపీఎస్‌ విధానాన్ని సంఘటితంగా వ్యతిరేకిద్దాం | - | Sakshi
Sakshi News home page

యూపీఎస్‌ విధానాన్ని సంఘటితంగా వ్యతిరేకిద్దాం

Feb 7 2025 1:21 AM | Updated on Feb 7 2025 1:21 AM

యూపీఎస్‌ విధానాన్ని సంఘటితంగా వ్యతిరేకిద్దాం

యూపీఎస్‌ విధానాన్ని సంఘటితంగా వ్యతిరేకిద్దాం

అలంపూర్‌: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రవేశపెట్టబోయే యూపీఎస్‌ విధానాన్ని సంఘాలకు అతీతంగా వ్యతిరేకిద్దామని సీపీఎస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. గురువారం అలంపూర్‌ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌, జిల్లా సీపీఎస్‌ నాయకులతో కలిసి మార్చి 2న నిర్వహించే చలోధర్నా, సీపీఎస్‌ యుద్ధభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం స్థితప్రజ్ఞ మాట్లాడుతూ... ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త సీపీఎస్‌ విధానం అమలు చేయనుందని, ఈ విధానాన్ని ఆదిలోనే వ్యతిరేకించాలన్నారు. సంఘాలు సంఘటితంగా వ్యతిరేకించకపోతే 20 ఏళ్ల క్రితం పరిస్థితులు పునరావృతం అవుతాయని అన్నారు. పదవీ విరమణ అయ్యే ఉద్యోగులకు నెలకు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు చాలీచాలలని పింఛన్‌ ఇస్తారని అన్నారు. ఉద్యోగులంతా ఏకమై మార్చిన 2న హైదరబాద్‌ ధర్నా చౌక్‌లో జరిగే సీపీఎస్‌ యుద్ధభేరికి పెత్తఎత్తున తరలివచ్చి ప్రభుత్వాలకు మన ఆవేదన తెలియజేద్దామన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిని జిల్లా నాయకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు, జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ రెడ్డి, నాయకులు రమేష్‌ కుమార్‌, ప్రతాప్‌ రెడ్డి, కృష్ణ, అమరేందర్‌ రెడ్డి, శ్రీనివాసులు, నాగరాజు, జగదీష్‌, మస్తా ఆయా శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement