పాండవుల గుట్టల్లో ట్రెయినీ అధికారులు | - | Sakshi
Sakshi News home page

పాండవుల గుట్టల్లో ట్రెయినీ అధికారులు

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

పాండవుల గుట్టల్లో ట్రెయినీ అధికారులు

హైదరాబాద్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్న 150మంది గ్రూప్‌–2 అధికారుల బృందం ఆదివారం రేగొండ మండలంలోని పాండవుల గుట్టలను సందర్శించింది. ఈ సందర్భంగా పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో వేసిన పెయింటింగ్‌ను పరిశీలించారు. అనంతరం వారంతా ట్రెక్కింగ్‌ చేసి ప్రకృతి అందాలను, ప్రాచీన రాతిచిత్రాలను ఆసక్తిగా తిలకించారు. చారిత్రక సంపదను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలని కోరారు.

– రేగొండ

ఫారెస్ట్‌లో 10 కి.మీ ట్రెక్కింగ్‌

వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మహదేవపూర్‌ టు కాటారం అటవీప్రాంతంలో బీరసాగర్‌ బీట్‌ పరిధిలోని మహదేవపూర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 10 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ ఆదివారం నిర్వహించారు. ట్రెక్కింగ్‌ సందర్భంగా అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటకు ఉపయోగించే ఉచ్చులు, కుంటలు, విద్యుత్‌ తీగలు తదితరాలను ఎఫ్‌ఆర్‌ఓ బృందం తనిఖీ చేసింది. అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎఫ్‌ఆర్‌ఓ రవికుమార్‌తో పాటు రేంజ్‌ సిబ్బంది, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

– కాళేశ్వరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement