ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి ఏరియాలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం గోరింటాకు వేడుకలు సందడిగా నిర్వహించారు. ఏరియాలోని పైలెట్‌కాలనీ సింగరేణి కమ్యూనిటీహాల్‌లో నిర్వహించిన వేడుకలకు ఏరియా సేవాసమితి అధ్యక్షురాలు ఏనుగు సునీత రాజేశ్వర్‌రెడ్డి హాజరై ప్రారంభించారు. సభ్యులు గోరింటాకు చేతులకు పెట్టుకుని మహిళలందరికీ గోరింటాకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోరింటాకు చర్మవ్యాధుల నుంచి రక్షణ ఇస్తుందన్నారు. ఒంట్లో వేడిని తగ్గిస్తుందన్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు అలంకరణ తెలుగువారి సంప్రదాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సాయికృష్ణ, సేవా కార్యదర్శి రుబినా, సభ్యులు పాల్గొన్నారు. – భూపాలపల్లి అర్బన్


