ఎస్‌ఎస్‌తాడ్వాయి : చదువుకు పేదరికం అడ్డుకాదని తాడ్వాయి ఎస్సై కొయ్యడ జగదీశ్ అన్నారు. కల్లు గీతకార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు గండు సదయ్య, కార్యదర్శి తిర్రి సంపత్ సమక్షంలో బుధవారం పదో తరగతి, ఇంటర్‌లో మెరిట్ సాధించిన గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కార సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్సై జగదీశ్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన రవి, కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు పులి నర్సయ్య హాజరయ్యారు. కాటాపూర్, నార్లపూర్, వెంగ్లాపూర్, తాడ్వాయి గ్రామాలకు చెందిన 12 మంది విద్యార్థులను సన్మానించి మెమోంటోలు అందజేశారు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘం నాయకులు ఎస్సై జగదీశ్‌ను శాలువాతో సన్మానించారు. రంగు సత్యనారాయణ, పాలకుర్తి బాబు, నర్సయ్య, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


