ములుగు రూరల్ : పార్లమెంట్‌లో మహిళ బిల్లును ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని టీపీసీసీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంగోత్ సుగుణ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలో మహిళా బిల్లును పార్లమెంట్‌లో పాస్‌చేయాలని పోస్టు కార్డు ఉద్యమం చేపట్టాగా ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ములుగు మున్సిపల్ చైర్మన్ చంద్రకళ, మండల మహిళ అధ్యక్షురాలు గుంటోజు పావనినిరంజన్, మున్సిపల్ కౌన్సిలర్లు నల్లెల స్వాతి, గుగ్గిల్ల దివ్య, గజ్జెల సుస్మిత, కోఆప్షన్ సభ్యులు అసియా, సుజాత, రాధిక, తదితరులు ఉన్నారు.


