ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

మహాముత్తారం : లారీల ఆలస్యంతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు బుధవారం మండలంలోని బోర్లగూడెం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.అధికారులు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీల్లో తరలించాలని డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌ లారీలను పంపించి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో కులసంఘాల జేఏసీ కన్వీనర్‌ అజ్మీరా పూల్‌సింగ్‌, రైతులు ఠాకూర్‌ లక్ష్మణ్‌, వెంకట్రాజం, బానోత్‌ దేవుసింగ్‌, ఠాకూర్‌ రవి, మొగిలి రమేష్‌, సూరెడ్డి నర్సింహరెడ్డి, పొనగంటి రాములు, శ్రీధర్‌, సింగనవేని తిరుపతి, లావుడ్య రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మార్క రాముగౌడ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని వజినేపల్లి, కోనంపేట, యామన్‌పల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కూడా లేవని ఆరోపించారు. రోజుల తరబడి కలాల్లో వడ్లు ఉండటంతో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి వెంటనే అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీల్లో తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు బోర్లగూడెం సర్పంచ్‌ అజ్మీరా ధరమ్‌సింగ్‌, పోలారం సర్పంచ్‌ అంబాల రాజబాపు, మహాముత్తారం మాజీ ఎంపీటీసీ శ్రీపతి సురేష్‌, నాయకులు గంట కొండాల్‌ రెడ్డి, జంగిడి శ్రీనివాస్‌, అరుణ, వేణుగోపాల్‌రెడ్డి, రమేష్‌, శంకర్‌ తొ పాటు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement