మేడారంలో నార్కొటిక్స్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

మేడారంలో నార్కొటిక్స్‌ తనిఖీలు

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

ఎస్‌ఎస్‌ తాడ్వాయి : మండలంలోని మేడారంలో బుధవారం నార్లాపూర్‌ ఎస్సై కమలాకర్‌ ఆధ్వర్యంలో పోలీసులు నార్కొటిక్స్‌ తనిఖీ చేపట్టారు. నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు స్నిఫర్‌ డాగ్‌తో విస్తృత తనిఖీ నిర్వహించారు. షాపులు, గోదాముల్లోని ప్రతి మూలన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. అనుమానిత సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement