భూపాలపల్లి అర్బన్ : ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో నిర్వహిస్తున్న ఇండియా మైన్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎండబ్ల్యూఎఫ్) జాతీయ మహాసభల్లో భూపాలపల్లి ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఈ మహాసభకు ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఆసిఫ్ పాషా, కరీముల్లా, అహ్మద్‌ఖాన్, శ్రీనివాస్, శ్రీనివాస్ హాజరయ్యారు. మహాసభలో గని కార్మికుల సమస్యలు, హక్కుల పరిరక్షణ, సింగరేణి భవిష్యత్, ప్రైవేటీకరణ, లేబర్ కోడ్స్ వ్యతిరేక పోరాటాలు, కార్మిక సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు వారు తెలిపారు. కార్మికుల హక్కుల సాధనకు ఏఐటీయూసీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని పేర్కొన్నారు.


