చిట్యాల : మండల కేంద్రంలోని పీఏసీఏస్ ఆధ్వర్యంలో 500 మెట్రిక్ టన్నుల నిల్వ చేసే గోదాం నిరుపయోగంగా ఉంది. దీంతో ఈ నెల 15న సాక్షి దినపత్రికలో ‘నిరుపయోగంగా పీఏసీఏస్ గోదాం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించి న జిల్లా అధికారులు ఎట్టకేలకు గోదాంలోకి రైతులు పండించిన ధాన్యాన్ని దిగుమతి చేసేందుకు అ నుమతించారు. చిట్యాల, మొగుళ్లపల్లికి చెందిన రై తులు తమ వాహనాల్లో ధాన్యాన్ని తీసుకువచ్చి క్యూ లో పెట్టారు. అనంతరం సంబంధిత అధికారులు హమాలీలతో దిగుమతి చేయిస్తున్నారు. కాగా సాక్షి కథనానికి స్పందించిన అధికారులకు, సాక్షికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మిగతా ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలని రైతులు వేడుకున్నారు.


