రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

చిట్యాల/గణపురం/భూపాలపల్లి రూరల్‌: ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ సందర్బంగా బుధవారం జిల్లా అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌తో కలిసి చిట్యాల మండలంలోని కై లాపూర్‌ శివారులోని మహావీర్‌, శ్రీవెంకటేశ్వర రైస్‌ మిల్లు, గణపురం మండలంలోని లక్ష్మీగణపతి రైస్‌మిల్లు, వెంకటేశ్వర ఇండస్ట్రీస్‌, భూపాలపల్లి మండలం గొర్లవేడులోని వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌ రైస్‌ మిల్లును ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం దిగుమతి జరుగుతున్నప్పటికీ రైతులకు ట్రక్‌ షీట్‌లు ఇవ్వకపోవడంప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంటా పూర్తయిన వెంటనే రైతులకు ట్రక్‌ షీట్‌ ఇవ్వాలని అసల్యం ఎందుకు జరుగుతుందని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ట్రక్‌ షీట్‌లు ఇవ్వకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలించొద్దన్నారు. దీనిపై జిల్లా అధికారుల పర్యవేక్షణ పెంచాలన్నారు. వర్షాలు వస్తే రైతులు ఇబ్బందులు పడతారని దిగుమతిని వేగవంతం చేయాలని మిల్లర్ల యాజమానులకు సూచించారు. ధాన్యం కొనుగోలులో గత బీఆర్‌ఎస్‌ 10 సంవత్సరాల పాలనలో రైతులు దోపిడీకి గురయ్యారని అది ఇప్పుడు పునరావృతం కాకుండ చూడాలన్నారు. ప్రతి ధాన్యం గింజ కాంటా అయ్యే వరకు రైతుల వెంట ఉంటామన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్‌కుమార్‌, డీఏం రాములు, జిల్లా సహకార అధికారి వాల్యానాయక్‌, మార్కెట్‌ చైర్మన్‌ గుమ్మడి శ్రీదేవి, తహసీల్దార్‌ వసంతరావు, ఆర్‌ఐ రాజేందర్‌, నాయకులు ముకిరాల మధువంశీకృష్ణ, తిరుపతి ఉన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement
 
Advertisement
Advertisement