వెంకటాపురం(కె): ఆదివాసీలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్స నర్సింహామూర్తి, గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో గిరిజనేతరులను ఏజెన్సీ నుంచి పంపించాలని కోరుతూ మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌ఆండ్‌బీ ప్రధాన రహదారిపై బైటాయించి ఽఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నర్సింహామూర్తి, సాయిలు మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన రాంబాబుపై దాడి చేసిన గిరిజనేతరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గిరిజనేతరుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాలను ఎంపీడీఓ జుమ్మిలాల్, తహసీల్దార్ వేణుగోపాల్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుంజా మహేష్, పూనెం ప్రతాప్, నాగరాజు, వాసం నారాయణ, బాబు, శివ, తదితరులు పాల్గొన్నారు.


