మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ | - | Sakshi
Sakshi News home page

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో

ఏటూరునాగారం: మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో అన్నారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మంగళవారం ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ ఆధ్వర్యంలో జన జాతీయ గరిమ్‌ ఉత్సవ్‌ 2026 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన హెల్త్‌ స్క్రీనింగ్‌, యాక్టివిటీ క్యాంప్‌, షీటీమ్‌ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మొక్కలను నాటారు. మొక్కలను ప్రతిఒక్కరూ నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ నాగోరావు, జిల్లా కోఆర్డినేటర్‌ హాస్పిటల్‌ సర్వీస్‌ డాక్టర్‌ జగదీశ్‌, స్టాటిస్టికల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ రాజ్‌కుమార్‌, సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement