ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

టీజీఏ అధ్యక్షుడు, ‘కుడా’ మాజీ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి

ఖిలా వరంగల్‌: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలు వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల రాష్ట్ర టీజీఏ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, ఉద్యమ నాయకులు అచ్చవిద్యాసాగర్‌, జేఏసీ కన్వీనర్‌ దిడ్డి నరేందర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం వరంగల్‌ కరీమాబాద్‌లోని చట్లోళ్ల గడ్డ వద్ద వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్‌ మరుపల్లి రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కేశవరావును చైర్మన్‌గా నియమించడం అధికార పార్టీకి వత్తాసు పలకడమేనన్నారు. అర్హత కలిగిన ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నప్పటికీ కేశవరావునే నియమించడం సరికాదన్నారు. ఇప్పటికై నా ఉద్యమకారుకిచ్చిన హామీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నార్లగిరి రమేశ్‌, నహీం, నర్సింగం, సాంబయ్య, రమేశ్‌, అబ్దుల్‌పాషా, శంకేసి లింగమూర్తి, రాజశేఖర్‌, ఎల్లయ్య, దిండిగాల సోమేశ్వర్‌, పరదేశి రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement