రేగొండ: ఆలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం కొడవటంచలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన సత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఆలయాల అభివృద్ధికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు. నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఆర్ సంస్థల అధినేత సంపత్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు


