రేగొండ: పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను గుర్తించి బాధితుడికి ఎస్సై సుధాకర్ మంగళవారం అందజేశారు. గణపురం మండల కేంద్రానికి చెందిన రాజు పరకాలకు వెళ్తుండగా ఫోన్ ఎక్కడో పడేసుకున్నాడు. ఈమేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు వివరాలు నమోదు చేసి సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్‌ఫోన్ గుర్తించి బాధితుడికి అందించారు. ఎవరైనా సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా ఫోన్ వివరాలు సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని, ఈ పోర్టల్ ద్వారా ఫోన్ తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్సై సూచించారు.


