బస్ షెల్టర్ నిర్మించాలి
కన్నాయిగూడెం: మండలంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం ఎండలోనే నిరీక్షిస్తున్నారు. మండలం నుంచి వందల వాహనాలు, వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే జిల్లా కేంద్రం నుంచి పలిమెల, మహదేవపూర్, మహాముత్తారం, కాళేశ్వరం, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఏటూరునాగారం, ములుగు, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాలకు రవాణా సాగిస్తుంటారు. కానీ మండలంలో ఇప్పటి వరకూ బస్టాండ్, బస్ సెల్టర్లు లేక ప్రధాన రహదారి వెంట ఉన్న ఎండలో ఉండి బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షించాల్సిన పరిస్థితి. అలాగే తాగు నీరు, నీడా లేక ఎండలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. బస్ షెల్టర్ లేకపోవడంతో బస్సుల కోసం చూస్తున్న ప్రయాణికులు ఎండకు తట్టుకోలేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికై న అధికారులు మండల కేంద్రంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించాలిన స్థానికులు కోరుతున్నారు.
బస్‌షెల్టర్ లేక అవస్థలు
పట్టించుకోని అధికారులు
బస్ షెల్టర్ లేక మండలంలోని ప్రయాణికులు గంటల కొద్ది ఎండల్లోనే నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో, లక్ష్మీపురం వద్ద బస్ షెల్టర్లు నిర్మించాలి. అలాగే తాగు నీరు ఇతర సౌకర్యాలు కల్పించాలి.
– రాజుకుమార్, యువకుడు, బుట్టాయిగూడెం


