గుడుంబా పట్టివేత | - | Sakshi
Sakshi News home page

గుడుంబా పట్టివేత

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

ఉరివేసుకొని వృద్ధురాలు.. మేడారంలో యాచకుడి మృతి

చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన తీగల రమ అక్రమంగా 10లీటర్ల గుడుంబాను రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నవాబుపేట గ్రామ శివారులో పోలీసులు ఉదయం పెట్రోలింగ్‌ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన తీగల రమ గుడుంబాను పట్టుకుని అమ్ముకునేందుకు వెళ్తుతుండగా పట్టుకున్నారు. గుడుంబాను స్వాధీనం చేసుకుని ఆమైపె కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని ఎవరైనా గుడుంబా అమ్మినా, తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మనస్తాపంతో

యువకుడి ఆత్మహత్య

గణపురం: మండలకేంద్రానికి చెందిన జక్కు వినయ్‌ (25) ఆరోగ్యం సహకరించడం లేదని మనస్తాపానికి గురై పరుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఎస్సై అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన జక్కున వినయ్‌ కొంత కాలంగా కిడ్నీల సంబంధిత వ్యాధితో ఎన్ని ఆస్పత్రులకు పోయిన నయం కావడం లేదు. దీంతో మనస్థాపంతో సోమవారం రాత్రి పరుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు తండ్రి జక్కు రవీందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 11 వార్డులోని నివాసం ఉంటున్న ఆగమ్మ (85) అనే వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవరు లేని సమయంలో మంగళవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలంలోని మేడారంలో అనారోగ్య కారణంగా 65 సంవత్సరాల గుర్తు తెలియని యాచకుడు ఈనెల 18న మృతి చెందినట్లు నార్లాపూర్‌పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రస్తుతం ఫ్రిజర్‌లో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడి బంధువులు, రక్త సంబంఽధీకులుగానీ మేడారంలోని నార్లాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు రావాలన్నారు. యాచకుడి గురించి ఎవరికై నా సమాచారం తెలిస్తే 87126 30132 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement