మొగుళ్లపల్లి: మండలంలోని ఇస్సిపేట సర్పంచ్ యార ముకుందర్ రెడ్డి, ఉపసర్పంచ్ బత్తిని శ్రీధర్ గౌడ్, లక్కమారి కాపు సంఘం గ్రామ అధ్యక్షుడు పెంతల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. రోజంతా ఎండలో పనిచేయకుండా ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు పనిచేసి సాధారణ జీవనం గడుపుతున్న కూలీలకు ఉపాధిహామీ పథకం చాలా ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఎండ తీవ్రత బాగా ఉన్నందున కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మాధవి, ఈసీ రాము, టీఏ శ్రావణ్, పంచాయతీ కార్యదర్శి సునీల్, సీనియర్ మేట్ అజయ్ పాల్గొన్నారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు సర్పంచ్ పిరీళ్ల భారతి మంగళవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీల ఆరోగ్యం దెబ్బతిన్నకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశామన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూలీలు ఉదయమే పనులు పూర్తి చేసుకుని ఉదయం 9గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆలకుంట వనిత, పంచాయతీ కార్యదర్శి శరత్ ఉన్నారు.


