విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు

ములుగు: మున్సిపాలిటీ పరిధిలోని 5 ,6వ వార్డులలోని లోఓల్టేజీ సమస్యను స్థానికులు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ, కౌన్సిలర్‌ గుగ్గిల్ల దివ్య దృష్టికి తీసుకవెళ్లారు. వారు స్పందించి ములుగు ట్రాన్స్‌కో ఎస్‌ఈ భిక్షపతి దృష్టికి సమస్యను తీసుకవెళ్లగా ఎస్‌ఈ వెంటనే స్పందించి లోఓల్టేజీ సమస్యను తీర్చేందుకు 160 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు విద్యుత్‌ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్‌, ఏఈ రవి, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement