దామెర : మహిళలు, బాలిక రక్షణకే షీటీంలు పని చేస్తున్నట్లు షీటీం ఎస్సై స్వాతి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్నేహ సమ్మర్ క్యాలెండర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే షీటీంలను సంప్రదించాలన్నారు. పోకిరీల వివరాలు అందజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను షీటీంలకు తెలుపాలన్నారు. అదే విధంగా ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులతో సోషల్ మీడియాలో చేస్తున్న స్నేహంతో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలికలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తరువాతే వివాహం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేశ్, ఏపీఓ అశోక్, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
షీటీం ఎస్సై స్వాతి


