పుష్కరస్నానానికి వచ్చే భక్తులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేశారు. వేసవికాలం కావడంలో ఇక్కడికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలి. దగ్గు, జలుబు, ఇబ్బందులు ఎదురైనట్లయితే వెంటనే వైద్యశిబిరాలకు రావాలి. ఎండలో తిరగకుండా ఉండాలి. మధ్యాహ్న సమయంలో స్నానం చేయకపోవడమే మంచిది. ప్రతీ రోజు ఒక్కో క్యాంపులో రెండు వేల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తాం.
– డాక్టర్ మధుసూదన్
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి


