పుష్కరాలకు కాళేశ్వరం ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు కాళేశ్వరం ముస్తాబు

May 19 2026 1:40 AM | Updated on May 19 2026 1:40 AM

కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు కాళేశ్వరాలయంతో పాటు పరిసరాలు ముస్తాబవుతున్నాయి. సోమవారం రాత్రి కాళేశ్వరం ఆలయ ప్రధాన ఆలయంతో పాటు శ్రీశుభానందదేవి, సరస్వతీఅమ్మవార్ల ఆలయాలతో పాటు ప్రకారాలకు రంగరంగుల విద్యుత్‌ దీపాలు అలంకరించారు. దీంతో ఆలయం జిగేల్‌మంటుంది.

ఏర్పాట్లు ఇలా..

కాళేశ్వరం ఆలయంలో క్యూలైన్‌లు, షామియానాలు, చలువ పందిర్లు వేశారు. ప్రసాద కౌంటర్లకు క్యూలైన్‌ ఏర్పాట్లు చేశారు. మెట్ల మార్గం నుంచి తోరణాలు ఏర్పాటు చేశారు. వంద గదుల వద్ద భారీ డార్మెటరీ హాలు ఏర్పాటు చేశారు. భక్తులు సేద తీరడానికి శ్రీరాజరాజేశ్వర వసతి గృహం వద్ద షామియానాలు వేశారు. ఆలయం, ఘాటు వద్ద ఏర్పాటు చేశారు. గ్రామంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.

నిరంతర విద్యుత్‌..

12 రోజుల పాటు నిరంతర విద్యుత్‌ ఉంటుందని ఎన్పీడీసీఎల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ భిక్షపతి తెలిపారు. పుష్కరాల కోసం ప్రత్యేకంగా 490 స్తంభాలు 16 కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్‌ లైన్‌ వేశామని తెలిపారు. 12 ట్రాన్స్‌ఫర్మర్‌లు, 23 పార్కింగ్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట డీఈ నాగరాజు, ఏడీఈ రమేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement