● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్: క్రీడలు యువతలో మానసికోల్లాసాన్ని పెంపొందించడంతోపాటు శారీరక దృఢత్వాన్ని, ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం 5కే రన్ నిర్వహించారు. ఈ సందర్భగా హనుమాన్ దేవాలయం నుంచి అంబేడ్కర్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు హాజరై మాట్లాడారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఐక్యత, పోటీతత్వం పెంపొందుతాయన్నారు. యువత ప్రతీ రోజూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ యువత ప్రతిభను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. అంబేడ్కర్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న సమ్మర్ క్రికెట్ క్యాంపు ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఎస్‌ఎం కొత్తపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. రైతులకు కోతలు లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్నాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా క్రీడల అధికారి రఘు పాల్గొన్నారు.


