బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

May 19 2026 1:40 AM | Updated on May 19 2026 1:40 AM

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్‌1 వరకు జరిగే సరస్వతినది అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చేపడుతున్న భద్రత, బందోబస్తు ట్రాఫిక్‌ ఏర్పాట్లను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ సోమవారం పరిశీలించారు. పుష్కర ఘాట్లు, పార్కింగ్‌ ప్రదేశాలు, ట్రాఫిక్‌ మళ్లింపు మార్గాలు, కంట్రోల్‌ రూమ్‌, సీసీ కెమెరా పర్యవేక్షణ, భక్తుల రాకపోకలకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లను అధికారులతో కలిసి సమీక్షించారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రత పరంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ 24 గంటలు అప్రమత్తంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి భక్తులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, నాగార్జున్‌రావు, ఎస్సైలు తమాషారెడ్డి, పవన్‌కుమార్‌, నరేష్‌, మహేందర్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement