యూత్‌ కమిటీలు పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

యూత్‌ కమిటీలు పూర్తిచేయాలి

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

చిట్యాల : యూత్‌ కాంగ్రెస్‌ పార్టీని పటిష్టం చేసేందుకు మండలంలోని అన్ని గ్రామాల కమిటీలను పూర్తిచేయాలని యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అల్లకొండ కుమార్‌ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో యూత్‌ కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్‌ మాట్లాడుతూ.. మండలంలోని గ్రామశాఖ యూత్‌ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పూర్తిస్థాయి మండల కమిటీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బొమ్మ కిరణ్‌గౌడ్‌, గోల్కొండ నాగరాజు, ఎలగొండ చిరంజీవి, తీగల నాగరాజు, గోపగాని శివ, చిట్కూరి రాజు, నీలేష్‌, భద్రి, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement