టేకుమట్ల : స్థానిక ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్‌ఫోర్స్ మండల అధికారులు ఏఓ కల్యాణి, ఎస్సై అమూల్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లోతనిఖీ చేపట్టారు. రికార్డులను, విత్తన ప్యాకెట్లు, మందులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. డీలర్లు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు, నిషేధిత గడ్డి మందులను విక్రయించినా కేసులు తప్పవని హెచ్చరించారు. రైతులకు విత్తనాలను విక్రయించినప్పుడు విధిగా రశీదు ఇవ్వాలని సూచించారు. ఏఈఓ రాహుల్, పోలీసులు ఉన్నారు.


