మల్హర్ : చికిత్స పొందుతున్న ఓ మహిళ మృతిచెందిన సంఘటన మల్హర్ మండలంలోని తాడిచర్లలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. తాడిచర్ల గ్రామానికి చెందిన తిక్క రమ (55) కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసింది. ఇటీవల కురిసిన వర్షం వల్ల కల్లంలో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. దీంతో ప్రతిరోజు కుటుంబ సభ్యులతో కలిసి రమ ధాన్యంను ఆరబెట్టడానికి వెళ్లేది. ఎండలో పనిచేయడంతో ఆదివారం వడదెబ్బ తగిలి అక్కడే స్పృహ కోల్పోయిందని కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటనే స్థానిక వైద్యులకు చూపించి భూపాలపల్లిలోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరచించారు. చికిత్స పొందుతూ రమ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.


