యోగాతో మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

యోగాతో మానసిక ప్రశాంతత

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

మహాముత్తారం : యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తోందని ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ ప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో సోమవారం ఫిట్‌ అండ్‌ యాక్టివ్‌ తెలంగాణ మారథాన్‌ అండ్‌ ఫిజికల్‌ లిటరసి కార్యక్రమం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం యోగా, ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్‌ రమేష్‌ బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌, జోడి క్రిష్ణవేణి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌ పర్సన్‌ శైలజ, పీఈటీ భారతి, ఉపసర్పంచ్‌ రామినేని పూజిత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు లింగమల్ల దుర్గయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

యోగా, రన్నింగ్‌తో ఆరోగ్యం

టేకుమట్ల : యోగా, రన్నింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఎంపీడీఓ అనిత అన్నారు. సోమవారం ప్రజాపాలన– ప్రగతిప్రణాళికలో భాగంగా మండల పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సురేష్‌ ఆధ్వర్యంలో యోగా, మారథాన్‌ 2కే రన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై అమూల్య హాజరై యోగా, 2కే రన్‌లో పాల్గొన్నారు. యోగా విశిష్టత చిన్మయ మిషన్‌ చైర్మన్‌ నేతుల రాజయ్య వివరించగా, ఈజీఎస్‌ ఏపీఓ రమేష్‌ యోగాసనాలను చేయించారు. అనంతరం 2కే రన్‌లో పాల్గొన్నారు. ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతతో పాటు, ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. యోగా వల్ల జీవన క్రియలు మెరుగుపడడమే కాకుండా పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతిదినం యోగా, వాకింగ్‌, రన్నింగ్‌ చేయాలన్నారు. మారథాన్‌లో ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు ఆరెపల్లి సర్పంచ్‌ మల్లయ్య బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మాట్ల శ్రీనివాస్‌, రాఘవరెడ్డిపేట, ఆరెపల్లి రామకిష్టాపూర్‌(వి), సుబ్బక్కపల్లి సర్పంచ్‌లు, డీఓపీ రఘు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సాధారణ వ్యక్తిలా ఎస్సై అమూల్య..

మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న గైక్వాడ అమూల్య సోమవారం యోగా, 2కే రన్‌లో పాల్గొనేందుకు సాధారణ వ్యక్తిలా వెళ్లారు. ఇటీవల మండల కేంద్రంలో పదో తరగతి పరీక్ష కేంద్రం వద్ద ఆకతాయిల ఆటకట్టించేందుకు సివిల్‌ డ్రెస్‌లో విద్యార్థినులతో కలిసి పరీక్ష కేంద్రం వద్ద పహారా చేసిన సంఘటన జిల్లాలో చర్చానీయాంశమైంది.

Advertisement
 
Advertisement
Advertisement