మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

చిట్యాల : మండలంలోని రామచంద్రాపూర్‌ గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలకు సర్పంచ్‌ గాజె హేమలతఅశోక్‌ సోమవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండ తీవ్రత దృష్ట్యా ఉపాధి కూలీలకు వడదెబ్బ నుంచి, వేసవి తీవ్రతను తగ్గించడానికి ఉపశమనం పొందడానికి మజ్జిగ ప్యాకెట్లు ఉపయోగపడుతాయని అన్నారు. ఉదయం ఆరు గంటలకు పనికి వెళ్లి పది గంటల లోపు పని పూర్తి చేసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున పలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ సిరిపురం నర్సింగం, వార్డు సభ్యులు ప్రభాకర్‌, వెంకటరమణ, సరోజన, దేవేంద్ర, మధుకర్‌ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

వాహనాల తనిఖీ

మహాముత్తారం : మండలంలోని యామన్‌పల్లి ప్రధాన కూడలి వద్ద సోమవారం మహాముత్తారం ఎస్సై–2 మహేష్‌ వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు లైసెన్స్‌తో పాటు వాహనపత్రాలు కలిగి ఉండాలన్నారు. అదే విధంగా డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సై వెంట పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement