మల్హర్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం హర్షణీయమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు అన్నారు. సోమవారం తాడిచర్లలో ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు బూడిద సతీష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదండ్ల గట్టయ్య, ప్రధాన కార్యదర్శి ముడితనపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ.. జీఓ 679 ద్వారా కేకే కమిటీకి చైర్మన్‌గా నియమితులైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండ రాం, అద్దంకి దయాకర్, ఎస్.రాములు నాయక్, మోతె శోభన్‌రెడ్డితో ఏర్పాటైన కమిటీ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ కృషిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీయూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలోజు సత్యనారాయణ, చొప్పరి రాజు, చాంద్ పాష, సారయ్య, చంద్రమౌళి, బడితల వెంకటస్వామి, కోట నవీన్, పద్మ, వసంతతో పాటు తదితరులు పాల్గొన్నారు.


