వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సర్వసభ్య సమావేశం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సర్వసభ్య సమావేశం

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

మల్హర్‌(కాటారం) : మండలంలోని కాటారం వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో సోమవారం చైర్‌ పర్సన్‌ పంతకాని తిరుమల అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు మార్కెట్‌ అభివృద్ధికి, రైతులకు కల్పించే మౌలిక సదుపాయాలపై పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్‌ తిరుమల వివరించారు. రాబోయే రోజుల్లో కోల్డ్‌ స్టోరేజ్‌ గోడౌన్‌ మార్కెట్‌ ప్రాంగణంలో సీసీ ప్లాట్‌ఫామ్స్‌ నిర్మాణంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మార్కెట్‌ ప్రహరీకి రూ.కోటి మంజూరు చేయించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు మార్కెట్‌ కమిటీ సభ్యులు కృతజ్ఞత తీర్మానం చేశారు. అనంతరం 12.09 ఎకరాల మార్కెట్‌ యార్డ్‌ స్థలాన్ని సరిహద్దులు సర్వే చేసి చూపిస్తే ప్రహరీ నిర్మాణం చేపట్టనున్నట్లు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ బ్రహ్మారెడ్డి, డైరెక్టర్లు తిరుపతిరావు, శ్రీనివాస్‌, రమేష్‌, రాజయ్య, రాజారాం, రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, ఇర్షాద్‌, సెక్రటరీ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement