మొగుళ్లపల్లి : దేశవ్యాప్తంగా ఈనెల 20న నిర్వహిస్తున్న మెడికల్ షాపుల బంద్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని మెడికల్ షాపుల యజమానుల సంఘం మండల కమిటీ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం తహసీల్దార్ సునీత, ఎస్సై సురేష్‌ను మెడికల్ షాపు యజమానుల సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాలు అందించి బంద్‌కు సహకరించాలని కోరారు. ఈ–ఫార్మసీ విధానం కార్పొరేట్ కంపెనీల అడ్డగోలు డిస్కౌంట్ల ద్వారా మెడికల్ షాపుల యజమానులు నష్టపోతున్నారని, వీటివల్ల ప్రజలకు నాణ్యమైన మందులు అందించలేకపోతున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పొతంగల్ జనార్దన్, ప్రధాన కార్యదర్శి దోమకుంట్ల రమేష్, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు జనార్దన్, నరసింహారాములు, మంత్రి బాబు, బూర రాజకుమార్, తిరుపతి, శ్రీకాంత్, ప్రకాష్ తదితరులు ఉన్నారు.


