రేగొండ: పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను గుర్తించి బాధితునికి కొత్తపల్లిగోరి ఎస్సై సాయి త్రిలోక్ రెడ్డి ఆదివారం అందజేశారు. మండలంలోని చిన్నకోడేపాక గ్రామానికి చెందిన పరుమండ్ల రాజు పరకాలకు వెళ్తుండగా ఫోన్ ఎక్కడో పోగొట్టుకున్నాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు వివరాలు నమోదు చేసి సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్‌ఫోన్ గుర్తించి బాధితునికి అందించారు. ఎవరైనా సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా , దొంగతనానికి గురైనా ఫోన్ వివరాలు సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్సై సూచించారు.


