కాళేశ్వరం: మహదేవ్‌పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తామని సర్పంచ్ హసీనాబానో, పీఎస్‌ఏ చైర్మన్ తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు అరుణ శ్రీనివాస్ తెలిపారు. విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ జన్ను విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించగా వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వారోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. అనంతరం క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


