మల్హర్: విద్యార్థులను సన్మానిస్తున్న అధ్యాపకులు
డీఈఓ చేతుల మీదుగా ప్రశంస ప్రతం అందుకుంటున్న విద్యార్థి రసజ్ఞ
మల్హర్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రం తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా2025–26 వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపల్ విజయ దేవి పర్యవేక్షణలో అధ్యాపకులు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అధ్యాపకేతరులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జిల్లా టాపర్‌కు రూ.10వేల చెక్కు
విద్యా విజయోత్సవం సందర్భంగా మండలం కేంద్రం తాడిచర్ల జిల్లాపరిషత్ పాఠశాలకు చెందిన పదవ తరగతి జిల్లా టాపర్ మేనం ప్రణవీ రూ.10వేల చెక్కును డీఈఓ రాజేందర్, విద్యా శాఖకు అకాడమిక్ ఆఫీసర్ విజయ్ పాల్‌రెడ్డి, క్యాంప్ మొబైలింగ్ ఆఫీసర్ రమేష్, సెక్టోరియల్ ఆఫీసర్స్ చేతుల మీదుగా అందుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రశంసా పత్రంతో సత్కరించి, చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెష్‌ఎస్ సీనియర్ ఉపాధ్యాయులు కుమారస్వామి, రమేష్ పాల్గొన్నారు.
విద్యార్థులకు నగదు బహుమతి
మల్హర్(కాటారం): విద్యా విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు పదివేల నగదు బహుమతి, ప్రశంస పత్రం ప్రదానం చేశారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన మండలంలోని గంగారం తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి మాచర్ల రసజ్ఞకు రూ.10వేల నగదు బహుమతి, ప్రశంస పత్రాన్ని డీఈఓ రాజేందర్ చేతుల మీదుగా అందుకుంది. ఈ సందర్భంగా రసజ్ఞను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బొంపల్లి గోవర్ధన్, అధ్యాపకులు, గంగారం సర్పంచ్ అభినందించారు.
మొగుళ్లపల్లి: విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఆదివారం బహుమతులు ప్రదానం చేశారు. మండంలోని కొర్కిశాల మోడల్ స్కూల్, కళాశాల విద్యార్థిని కె.సంజన ఇంటర్‌లో 973మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఈసందర్భంగా డీఈఓ రాజేందర్ చేతుల మీదుగా సంజనకు రూ.10వేల నగదు బహుమతితోపాటు ప్రశంస పత్రం అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేశ్ తెలిపారు.


