● కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు చింత క్రాంతి
గోవిందరావుపేట: మహిళల అభివృద్ధే రాష్ట్ర ప్ర భుత్వ ధ్యేయం అని కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు చింత క్రాంతి అన్నారు. మండలంలోని కర్లపల్లిలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనానికి శనివారం చింత క్రాంతి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలకు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు శాశ్వత వేదికగా మహిళా సమాఖ్య భవనాలు ఉపయోగపడుతాయని అన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చేందేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. సర్పంచ్ విజయ బాలరాజు, ఈక అప్పయ్య, హూసేన్, సమ్మయ్య,రాంబాబు, ప్రవీణ్, మల్లేష్, మహిళలు, గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


