బస్తాలు తీసుకెళ్లడం లేదు
లారీలు లేక కొనుగోలు కేంద్రంలో ఉన్న బస్తాలు
కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోస్తున్న రైతులు
ఏటూరునాగారం: వాతావరణంలో తరుచూ మా ర్పులు వస్తుండడంతో రైతుల్లో వణుకు పుడుతుంది. ఎప్పుడు వర్షం వస్తుందోనని భయంతో గడుపుతున్నారు. ధాన్యం కాంటా అయినప్పటికీ లారీల్లో ఎగుమతి కాకపోవడంతో రైతులు పడిగాపులు పడుతున్నారు. మండలంలో కొనుగోలు కేంద్రాలు 11 ఉన్నప్పటికీ వాటి ద్వారా లారీల్లో మిల్లుకు బస్తాలు ఎగుమతి కావడం లేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు, ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం ఎప్పుడు వ చ్చి తమను నష్టపర్చుతుందని ఆందోళన చెందుతున్నారు. ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన నిర్వాహకుల నిర్లక్ష్యం మూ లంగా లారీలు సమయానికి రాక ఎగుమతి కాకపోవడంతో పడిగాపులు పడుతున్నారు. మరికొంత మంది పండించిన ధాన్యం మార్చరైజ్(తేమశాతం) తగినంత లేదని కొనుగోలు కేంద్రాల వద్దనే ఆరబెట్టుకొని కాపాల కాస్తున్నారు. ఇప్పటికై నా మండల, జిల్లా అధికారులు స్పందించి లారీలను వెనువెంటనే తరలించి బ స్తాలను మిల్లులకు పంపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
లారీల కొరతతో అవస్థలు
కాంటాలు అయినా కదలని బస్తాలు
వాతావరణంలో మార్పులు
పండించిన ధాన్యంను తరలించడం లేదు. తేమశాతం లేదని కోతలు పెడుతున్నారు. లారీలు రావడం లేదని బస్తాలను ఇక్కడే నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. లారీలు లేక బస్తాలు పోక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. వర్షం ఎప్పుడు వస్తుందోనని టార్పాలిన్‌లు పట్టుకొని ఇక్కడే కూర్చుకుంటున్నాం.
– కంకనాల నర్సయ్య, ఏటూరునాగారం


