రేగొండ: అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్న మహిళపై కేసు నమోదు చేసి గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు కొత్తపల్లిగోరి ఎస్సై సాయిత్రిలోక్‌నాథ్ రెడ్డి తెలిపారు. కొత్తపల్లిగోరి మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన గుడా లక్ష్మీ ఇంటి వద్ద అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించి లక్ష్మీ వద్ద 4 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
టేకుమట్ల: మండలంలోని కుందనపల్లి గ్రామానికి చెందిన ఎంఎస్పీ మండల కన్వీనర్ మాడుగుల వీరయ్య తల్లి రాజమల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని ఆదివారం ఎమ్మార్పీఎస్ నాయకులు పరామర్శించి 50కిలోల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రేనుకుంట్ల శంకర్, ప్రధాన కార్యదర్శి ఇల్లందుల శంకర్, జిల్లా నాయకులు రాంచందర్, సంపత్, తదితరులు ఉన్నారు.
కాళేశ్వరం: మహదేవ్‌పూర్ మండలంలోని అంబట్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను పట్టుకున్నట్లు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వివరాలను వెల్లడించారు. ఆదివారం అంబట్‌పల్లిలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పేకాటస్థారంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.21వేల నగదు, సెల్ ఫోన్లు, ప్లేయింగ కార్డులను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వెంకటాపురం(కె): మండల పరిధిలోని వెంగళరావుచపేట గ్రామంలో దుక్కిటెద్దులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని గ్రామానికి చెందిన సమ్మయ్య అనే వ్యక్తి ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఫిరాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సమ్మయ్య అతడి తమ్ముడి కుమారుడి పెళ్లి ఉండగా ఏప్రిల్ 30 వెళ్లాడు. పెళ్లిలో ఉండగానే పట్టపగలు అతడి ఇంటి ముందు ఉన్న దుక్కిటెద్దులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారని తెలిపారు. ఎద్దులకోసం పది రోజుల వరకు వెతికిన ఆచూకి లభించలేదని అన్నారు. మండలం నుంచి అక్రమంగా పశువులను తరలించే వ్యక్తులు తమ ఎద్దులను అపహరించుకు పోయారనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం పూర్తి స్థాయిలో విచారణ చేసి తనకు న్యాయం చేయాని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
గోవిందరావుపేట: మండల పరిదిలోని చల్వాయి గ్రామానికి చెందిన నిరుపేద కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గణపాక సుధాకర్ కుటుంబం జీవనోపాధి కోసం ఫాస్ట్ ఫుడ్ స్టాండ్‌ను కాంగ్రెస్ నాయకులు ఆదివారం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆర్థిక సాయంతో నాయకుడు పైడాకుల కృష్ణమూర్తి ఈ స్టాండును సుధాకర్‌కు బహూకరించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. తేళ్ల హరిప్రసాద్, వేల్పుగొండ ప్రకాష్, చాపల నరేందర్ రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.


