వాజేడు: గ్రాసం కోసం మూగ జీవాలు అలమటిస్తున్నాయి. ప్రతీ ఏదాడి యాసంగి పంటలు అయి పోగానే రైతులు మూగ జీవాల కోసం మేతను సేకరించి నిలువ చేస్తారు. ఈ ఏడాది పంటలు అయి పోగానే మేతను సేకరించే పనిలో రైతులు సిద్ధమయ్యారు. కాని వేసవి ఎండలు అధికంగా ఉండటంతో పంటలు పూర్తి కాక ముందే ఎరగళ్లు పడి గడ్డి చాలా వరకు కాలిపోతుంది. దీంతో వరి గడ్డి సేకరణ కష్ట సాధ్యంగా మారింది. కొందరు రైతులు మాత్రమే ముందస్తుగా గడ్డిని సేకరించి భద్రపర్చుకున్నారు. మూగ జీవాలకు మేతను ఏర్పాటు చేయడం కోసం రైతుల తిప్పలు తప్పని పరిస్థితి కనిపిస్తుంది.
ప్రమాదవశాత్తు దగ్ధమైన గడ్డి..
వేసవి ఎండలు అధికంగా ఉండడంతో పొలాలు కోసిన వెంటనే ప్రమాదవశాత్తు గడ్డి దగ్ధమవుతుంది. కొందరు రైతులు వారి పొలంలోని గడ్డికి నిప్పు పెడుతున్నారు. ఒక పక్క కొయ్య కాలును తగలబెట్టవద్దని అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు రైతుల్లో ఇంకా మార్పు రావడం లేదు. దీంతో మేత లభించే అవకాశాలు లేక పోవడంతో పశువులకు మేతను ఎక్కడి నుంచి తీసుకు రావాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఉదయం లేవగానే మూగ జీవాలను వదిలేస్తున్నారు. వాటికి మేత లభించే అవకాశం లేక పోవడంతో చెట్లు, పుట్టలు, వాగుల వెంట తిరుగుతున్నాయి. పొద్దంతా రోడ్ల వెంట తిరిగి కాలీ కడుపుతో ఇంటికి వస్తున్నాయి. వర్షాలు కురిస్తేనే పశువులకు మేత లభించే అవకాశాలు ఉన్నాయి.
ప్రమాదవశాత్తు దగ్ధమవుతున్న గడ్డి
మేత లభించక అలమటిస్తున్న
మూగ జీవాలు


