బాధిత కుటుంబాలకు పరామర్శ | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాలకు పరామర్శ

May 19 2026 1:16 AM | Updated on May 19 2026 1:16 AM

బాధిత కుటుంబాలకు పరామర్శ

ములుగు రూరల్‌: పరామర్శిస్తున్న మంత్రి సీతక్క

వెంకటాపురం(ఎం)లో..

ములుగు రూరల్‌: మల్లంపల్లి మండలంలోని గౌస్‌పల్లి గ్రామానికి చెందిన తిప్పారపు కిషన్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా ఆదివారం పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్క బాధితుడిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

వెంకటాపురం(ఎం): మండల కేంద్రానికి చెందిన అన్నబోయిన ఐలక్క ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని ఆదివారం ఉప సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్ల కార్తీక్‌ పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట ఉప సర్పంచ్‌లు చింతం ప్రకాష్‌, ఎ.రాజు, బద్రునాయక్‌, రాజు యాదవ్‌ ఉన్నారు.

గోవిందరావుపేట: మండలంలోని కర్లపల్లి గ్రామానికి చెందిన తండ్రికొడుకులు రసపుత్‌ రాజు, పవన్‌ ఇటీవల బావిలో పడి మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాన్ని జిల్లా కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌ గౌడ్‌ ఆదివారం పరామర్శించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వెంకటకృష్ణ, నాయకులు జంపాల ప్రభాకర్‌, శ్రీకాంత్‌, రసపుత్‌ సీతారాం నాయక్‌, నాగమణి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement