ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

May 19 2026 1:16 AM | Updated on May 19 2026 1:16 AM

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

చిట్యాల: ప్రతీ వాహనాదారుడు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఎస్సై–3 ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని శివాజీ సెంటర్‌ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్‌ నియమ నిబంధనలు పాటించాలని కోరారు. అలాగే డ్రైవింగ్‌ చేసే వారి వద్ద తప్పకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌లతో పాటు తదితర పత్రాలను కలిగి ఉండాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పోలీస్‌ సిబ్బంది లాల్‌సింగ్‌, క్రాంతి, సందీప్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సై ఈశ్వరయ్య

Advertisement
 
Advertisement
Advertisement