భూపాలపల్లి అర్బన్: ప్రతీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని, టీబీపై పోరాటం మన అందరి బాధ్యత కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. మంగళవారం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ఉచిత టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీబీపై ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యాచరణలో భాగంగా మున్సిపల్ కార్మికులు, ఆశ సిబ్బందికి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి, మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, కౌన్సిలర్ అప్పం కిషన్, ప్రోగ్రాం అఽధికారిణి డాక్టర్ ఉమారాణిలు పాల్గొన్నారు.


