గ్యాస్‌ కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కష్టాలు!

Mar 25 2026 7:28 AM | Updated on Mar 25 2026 7:28 AM

హోటళ్లలో కట్టెల పొయ్యి మీదనే వంటలు

ఇబ్బందులు పడుతున్నాం..

భూపాలపల్లి అర్బన్‌: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. వంటగ్యాస్‌ కొరత తీవ్రతరం కాకపోయినా.. కమర్షియల్‌ సిలిండర్ల సరఫరాను తగ్గించారు. దీంతో హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, తోపుడు బండ్లపై తినుబండారాలు, టిఫిన్లు అమ్మేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని వంటలు చేస్తుండగా కమర్షియల్‌ గ్యాస్‌పైనే ఆధారపడిన టిఫిన్‌ సెంటర్లు, తోపుడు బండ్ల వ్యాపారులు వాటిని మూసివేసుకోవాల్సి న పరిస్థితి ఏర్పడుతుంది. కమర్షియల్‌ వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర గతంలో రూ.2వేలు ఉండగా బ్లాక్‌ మార్కెట్‌లో ఒక్కో సిలిండర్‌ రూ.4వేల నుంచి రూ.5వేల వరకు అమ్ముతుండడంతో చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 400పైగా హోటళ్ల, టిఫిన్‌ సెంటర్ల, తోపుడు బండ్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో సుమారు 10కిపైగా హోటళ్లు మూడపడ్డాయి.

మూత పడుతున్న టిఫిన్‌ సెంటర్లు, చిన్న హోటళ్లు

ఇబ్బందులు పడుతున్న

చిరు వ్యాపారులు

బతుకుదెరువు కోసం బజ్జ్జీల బండి ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాం. పది రోజుల నుంచి గ్యాస్‌ సిలిండర్‌ కొరతతో ఇబ్బందులు పడుతున్నాం. కమర్షియల్‌ సిలిండర్లు రావడం లేదు. దీంతో రెండు రోజుల నుంచి బజ్జీల బండి తీయడం లేదు. రోజు వారి ఖర్చులు, గిరి గిరి చిటీలు కట్టడం ఇబ్బందిగా మారింది.

– ఉపాధ్యాయ్‌ శుభం, బజ్జీల బండి నిర్వాహకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement