పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి

Mar 25 2026 7:28 AM | Updated on Mar 25 2026 7:28 AM

పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి

మల్హర్‌(మహాముత్తారం):పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం మహాముత్తారం మండలంలోని కేజీబీవీ పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంతో విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పాఠశాలలో పిచ్చిమొక్కలు తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. దీంతో విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందన్నారు. చేపట్టిన పారిశుద్ధ్య పనుల ఫొటోలను తనకు పంపించాలని సూచించారు. అదనంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచాలన్నారు. రో డ్డు, విద్యుత్‌ పనులను వెంటనే వేగవంతం చేసి, వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత శాఖ ల అధికారులను ఆదేశించారు. అనంతరం టెన్త్‌ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హలో స్టూడెంట్స్‌ ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలు రాశారు? ఎలా రాశారు? ఇంకా ఎన్ని పరీక్షలు మిగిలి ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థుల ను ప్రోత్సహించారు. కార్యక్రమంలో కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, డీఈఓ రాజేందర్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ ప్రకాష్‌, సర్పంచ్‌ బాబు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్‌ పాల్గొన్నారు.

సీఎస్‌ఆర్‌ నిధులు కీలకం

గ్రామాల అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధులు కీలకమని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. మంగళవారం మండలంలోని మండల పరిషత్‌ పాఠశాలలో హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్‌ నిధులతో ఏర్పాటు చేసిన స్మార్ట్‌ తరగతి గదులు, ఆధునికీకరించిన మరుగుదొడ్లు, ఎమ్మార్సీ భవనం, చిన్నారుల కోసం ఏర్పాటు చేసి న ఆట పరికరాలను కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. కార్యక్రమంలో అయి త ప్రకాష్‌రెడ్డి, డీఈఓ రాజేందర్‌, హెచ్‌డీఎఫ్‌సీ జోనల్‌ మేనేజర్‌ రుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

రోడ్డు, విద్యుత్‌ పనులు

వేగవంతం చేయాలి

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement