ఆదమరిస్తే అంతే..!
చిట్యాల మండల కేంద్రం నుంచి టేకుమట్లకు వెళ్లే ప్రధాన రహదారిలో పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదకరంగా ఉంది. వర్షాలకు చెరువు నిండి రోడ్డు కోతకు గురికావడంతో అదే ప్రాంతంలో తుమ్మ చెట్లు మొలిశాయి. దీంతో ఆ రోడ్డు కనబడకుండా అయింది. ఎదురెదురుగా ఏమైనా పెద్ద వాహనాలు వస్తే ఈ రోడ్డుకు సైడ్ దిగితే మాత్రం పెద్ద ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్‌అండ్‌బీ అధికారులు కనీసం కోతకు గురైన రోడ్లను పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – చిట్యాల


