అవినీతి నిర్మూలనలో యువత పాత్ర కీలకం
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: అనినీతి నిర్మూలనలో యువత పాత్ర కీలకమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. అవినీతి నిర్మూలన వారోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పట్టణంలో నిర్వహించిన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవినీతిని ఎవరూ ప్రోత్సహించవద్దని, ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలన్నారు. పారదర్శక పరిపాలన, అవినీతి నిర్మూలన కోసం పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు.


