తెలంగాణ స్ఫూర్తి వికసించాలి
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు..
భూపాలపల్లి: తెలంగాణ స్ఫూర్తి తరతరాల పాటు వికసించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. ప్రజల్లో ఐక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించే ప్రతీకగా తెలంగాణ తల్లి నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతీ వ్యక్తి పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సేవల్లో పారదర్శకత ఉండాలి..
అవినీతి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా అవినీతి నిరోధక శాఖ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన అవినీతి నిర్మూలన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబరు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అవినీతి నిర్మూలన వారోత్సవాలను పురస్కరించుకుని వివిధ విభాగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందే ప్రతీ పౌరుడు అవినీతి విషయమై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా అవినీతి ఘటనలు గమనించినప్పుడు వెంటనే అవినీతి నిరోధక శాఖకు సమాచారం తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, సీఐ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల గోదాం తనిఖీ..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఎన్నికల ఈవీఎం గోదాంను పలు రాజకీయ పార్టీల నాయకులతో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. అనంతరం లాక్ బుక్‌లో కలెక్టర్ సంతకం చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గోదాం తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ అబ్బాస్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
అవినీతి నిర్మూలనలో
భాగస్వాములు కావాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. మొదటి దశ ఎన్నికల నిర్వహణపై మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సాధారణ, వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు ఎస్పీ సంకీర్త్, ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఫణింద్రరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ రవి, డీపీఓ శ్రీలత, నోడల్ అధికారులు పాల్గొన్నారు.


