మరో వారం హడావుడి
మొదటి విడత ఎన్నికలు గురువారం జరగనుండగా.. రెండో విడత 14, మూడో విడత ఎన్నికలు 17న నిర్వహించనున్నారు. మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గురువారం ఉమ్మడి జిల్లాలోని 555 పంచాయతీలకు ఏకగ్రీవాలను మినహాయించి 512 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. 4,901 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకుని పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు తరలేలా ఏర్పాట్లు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదటి విడతలో గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాల పరిధిలో 73 సర్పంచ్, 559 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగనుంది.


