కలెక్టర్‌ను కలిసిన ఎన్నికల పరిశీలకులు
గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు, టీజీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఫణింద్రరెడ్డి గురువారం కలెక్టర్ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, పోలింగ్ నిర్వహణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో లోపాలు లేకుండా సక్రమంగా నిర్వహిస్తామన్నారు.
కలెక్టర్‌ను కలిసి పూలమొక్క అందజేస్తున్న ఎన్నికల సాధారణ పరిశీలకులు ఫణింద్రరెడ్డి


